కన్నన్ శ్రేష్టి జయంతి వేడుకల్లో వెంకయ్య
Sakshi Education
తమిళనాడు రాజధాని చెన్నైలోని కొరుక్కుపేటలో ఆగస్టు 24న నిర్వహించిన కన్నన్ శ్రేష్టి 150వ జయంతి వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కన్నన్ శ్రేష్టి, సీతమ్మ గార్ల విగ్రహాలను, కన్నన్ శ్రేష్టి స్మారకార్థం పోస్టల్ స్టాంప్‌ను వెంకయ్య ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఉన్నతమైన ఆశయాలతో, సాంకేతిక విధానాలతో దేశం ముందుకు సాగుతోందని వ్యాఖ్యానించారు.
ధర్మమూర్తి రావు బహదూర్ కలవల కన్నన్ శ్రేష్టి చారిటీస్, చెన్నై ఆధ్వర్యంలో జరిగిన కన్నన్ శ్రేష్టి జయంతి వేడుకల్లో తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, తమిళనాడు మంత్రి జయకుమార్, చారిటీస్ అధ్యక్షుడు వెంకటేశ పెరుమాళ్, మేనేజింగ్ ట్రస్టీ కన్నయ్య శెట్టి తదితరులు పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కన్నన్ శ్రేష్టి 150వ జయంతి వేడుకలు
ఎప్పుడు : ఆగస్టు 24
ఎవరు : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : చెన్నై, తమిళనాడు

Published date : 26 Aug 2019 06:06PM