కమాండోస్ ఫర్ రైల్వే సేఫ్టీ ప్రారంభం
Sakshi Education
రైళ్ల భద్రత కోసం కమాండోస్ ఫర్ రైల్వే సేఫ్టీ (కోరాస్) యూనిట్‌ను కేంద్ర రైల్వే, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆగస్టు 14న ఢిల్లీలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోరాస్ కమెండోలకు అంతర్జాతీయ శిక్షణ ఇవ్వాల్సిందిగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)కు సూచించినట్లు తెలిపారు. కోరాస్ యూనిట్‌ను మొదట ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో మోహరించనున్నట్లు వెల్లడించారు. కశ్మీర్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలు, తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా ఉండే ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బెంగాల్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కమాండోలు భవిష్యత్‌లో సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కమాండోస్ ఫర్ రైల్వే సేఫ్టీ (కోరాస్) యూనిట్ ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : కేంద్ర రైల్వే, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : రైళ్ల భద్రత కోసం
క్విక్ రివ్యూ :
ఏమిటి : కమాండోస్ ఫర్ రైల్వే సేఫ్టీ (కోరాస్) యూనిట్ ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : కేంద్ర రైల్వే, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : రైళ్ల భద్రత కోసం
Published date : 15 Aug 2019 05:26PM