Skip to main content

కిసాన్-జవాన్ సదస్సులో రాజ్‌నాథ్‌సింగ్

జమ్మూకశ్మీర్‌లోని లేహ్‌లో ఆగస్టు 29న డీఆర్‌డీవో ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కిసాన్-జవాన్ విజ్ఞాన్ మేళా’సదస్సులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించడం పూర్తిగా భారతదేశ అంతర్గత విషయమని, ఈ విషయంలో పాకిస్తాన్‌కు సంబంధం లేదని, కశ్మీర్‌పై ఏడుపు ఆపాలని పాకిస్తాన్‌కు సూచించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్, బలూచిస్తాన్ భారతదేశంలో భాగమేనంటూ 1994లో భారత పార్లమెంట్‌లో చేసిన తీర్మానాన్ని ప్రస్తావించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
కిసాన్-జవాన్ విజ్ఞాన్ మేళా సదస్సు
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
ఎక్కడ : లేహ్, జమ్మూకశ్మీర్
Published date : 30 Aug 2019 05:16PM

Photo Stories