Skip to main content

కేంద్ర మాజీ మంత్రి మాధవ్‌సింహ్ సోలంకీ కన్నుమూత

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర విదేశాంగ శాఖ మాజీ మంత్రి మాధవ్‌సింహ్ సోలంకీ(93) జనవరి 9న గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో తుదిశ్వాస విడిచారు.
Current Affairs
1927, జూలై 30న జన్మించిన సోలంకీ 1991 నుంచి 1992 దాకా విదేశాంగ మంత్రిగా పనిచేశారు. నాలుగు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. గుజరాత్ నుంచి రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన తనయుడు భరత్‌సింహ్ సోలంకీ సైతం గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర విదేశాంగ శాఖ మాజీ మంత్రి కన్నుమూత
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : మాధవ్‌సింహ్ సోలంకీ(93)
ఎక్కడ : గాంధీనగర్, గుజరాత్
Published date : 11 Jan 2021 05:56PM

Photo Stories