కేంద్ర మాజీ మంత్రి హెచ్‌ఆర్ భరద్వాజ్ కన్నుమూత
Sakshi Education
కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత హన్స్‌రాజ్ భరద్వాజ్ (83) మార్చి 8న కన్నుమూశారు.
కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని మాక్స్ ఆస్పత్రిలో మార్చి 8న తుదిశ్వాస విడిచారు. 1937 మే, 17న హరియాణలోని రోహతక్‌లో జన్మించిన ఆయన 1982లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజీవ్ గాంధీ, పీవీ మంత్రివర్గాల్లో న్యాయశాఖ సహాయ మంత్రిగా, యూపీఏ హయాంలో కేబినెట్ మంత్రిగా పదవులు చేపట్టారు. 2009 నుంచి 2014 వరకు కర్ణాటక గవర్నర్‌గా పనిచేశారు. కొంతకాలం పాటు కేరళ గవర్నర్‌గా కూడా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : హన్స్‌రాజ్ భరద్వాజ్ (83)
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : అనారోగ్యం కారణంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : హన్స్‌రాజ్ భరద్వాజ్ (83)
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : అనారోగ్యం కారణంగా
Published date : 10 Mar 2020 06:58PM