Skip to main content

కాకినాడ సెజ్‌లో పెట్రోకెమికల్ ప్రాజెక్టు ఏర్పాటు

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జీఎంఆర్ గ్రూపునకు చెందిన కాకినాడ సెజ్‌లో పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటుచేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మేరకు టీజీవీ గ్రూపు సంస్థ అయిన హల్దియా పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌తో రాష్ట్ర ప్రభుత్వం జనవరివ 4న ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంప్లెక్స్ వల్ల రూ.60 వేల కోట్ల పెట్టుబడులు, వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వ అంచనా. హల్దియా సంస్థ ఇప్పటికే బెంగాల్‌లోని హల్దియా వద్ద నాఫ్తా ఆధారిత అతిపెద్ద పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను నిర్వహిస్తోంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : హల్దియా పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ఒప్పందం
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : ఏపీ ప్రభుత్వం, హల్దియా పెట్రోకెమికల్స్ లిమిటెడ్
ఎక్కడ : కాకినాడ సెజ్, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
Published date : 05 Jan 2019 05:42PM

Photo Stories