Skip to main content

జూన్ 21న కాళేశ్వరం పథకం ప్రారంభం

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 2019, జూన్ 21న ప్రారంభంకానుంది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ నుంచి గోదావరి నీటిని ఎత్తిపోయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొత్త శకానికి నాంది పలకనుంది. తెలంగాణ భూ భాగంలోని దాదాపు 70 శాతం జిల్లాలకు సాగు, తాగు, పరిశ్రమల అవసరాలను తీర్చే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. గోదావరిలో వరద ఉండే దినాలను బట్టి కనిష్టంగా 150 టీఎంసీల నీటిని ఈ పథకం ద్వారా ఎత్తిపోయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివ‌ర‌కు ఈ ప్రాజెక్టు కోసం రూ.50 వేల కోట్ల మేర నిధులను ప్రభుత్వం ఖర్చు చేసింది.

కాళేశ్వరం పథకానికి 2016, మే 2న కన్నెపల్లి వద్ద ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే ప్రాజెక్టులోని ప్రధాన భాగమైన బ్యారేజీలు, పంపుహౌస్‌ల నిర్మాణం పూర్తయింది. రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 141 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 20 లిఫ్టులను నిర్మిస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులు ఇప్పటికే పూర్తవగా, మేడిగడ్డ పంప్‌హౌజ్‌లో 11 మోటార్లకు గానూ 8 మోటార్లు సిద్ధమయ్యాయి.

కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యాంశాలు..
  • ప్రాజెక్టు మొత్తం అంచ‌నా వ్యయం: రూ.80,499 కోట్లు.
  • నీటిని సరఫరా చేసే మార్గం పొడవు: 1832 కి.మీ.
  • వాలు కాలువ పొడవు: 1531 కి.మీ.
  • వాలు టన్నెల్ పొడవు: 203 కి.మీ.
  • ప్రెషర్ పైపు లైన్ పొడవు: 98 కి.మీ.
  • లిఫ్టులు: 20
  • పంపు హౌస్‌లు: 19
  • అవసరమయ్యే విద్యుత్: 4,992.47 మెగావాట్లు
  • జలాశయాలు: 19
  • జలాశయాల నిల్వ సామర్థ్యం: 141 టీఎంసీ

ప్రాజెక్టులో నీటి లభ్యత (టీఎంసీల్లో)
  • గోదావరి నీరు: 180
  • ఎల్లంపల్లి ప్రాజెక్టులో లభ్యమయ్యే నీరు: 20
  • ఎల్లంపల్లి వద్ద మొత్తం నీటి లభ్యత: 200
  • చెరువుల పరివాహక ప్రాంత నీటి లభ్యత: 10
  • ఆయకట్టు ప్రాంతంలో భూగర్భ జలాల రీచార్జ్: 25
  • ఆవిరి నష్టాలు: 10
  • ప్రాజెక్టు వినియోగానికి నికరంగా నీటి లభ్యత: 225

కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రతిపాదిత జలాశయాలు

బ్యారేజీ/రిజర్వాయర్

సామర్ధ్యం (టీఎంసీల్లో)

మేడిగడ్డ

16.17

అన్నారం

10.87

సుందిళ్ల

8.83

మేడారం

0.78

అనంతగిరి

3.50

రంగనాయక సాగార్

3.00

మల్లన్న సాగర్

50.00

మలక్‌పేట

3.00

కొండ పోచమ్మ సాగర్

15.00

గంధమల్ల

9.87

బస్వాపురం

11.39

భూంపల్లి

0.09

కొండెం చెరువు

3.50

తిమ్మక్కపల్లి

1.50

దంతెపల్లి

1.00

ధర్మారావు పేట

0.50

ముద్దిజివాడి

0.50

కాటేవాడి

0.50

మోతె

1.00

మొత్తం

141.00

Published date : 13 Jun 2019 05:53PM

Photo Stories