Skip to main content

జస్టిస్ ర్యాంకింగ్స్‌లో మహారాష్ట్రకు అగ్రస్థానం

వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో టాటా ట్రస్ట్ రూపొందించిన ‘ఇండియా జస్టిస్’ ర్యాంకింగ్స్‌లో 18 పెద్ద రాష్ట్రాల కేటగిరీలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది.
తెలంగాణకు 11, ఆంధ్రప్రదేశ్ 13వ ర్యాంకులు దక్కగా... ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు అట్టడుగున నిలిచాయి. పౌరులకు న్యాయ సేవలు అందుతున్న తీరుకు అద్దం పట్టే ఈ నివేదికను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్ నవంబర్ 7న ఆవిష్కరించారు.

నాలుగు కేటగిరీలుగా..
పోలీస్, ప్రిజన్స్, జ్యుడీషియరీ, లీగల్ ఎయిడ్ అనే నాలుగు కేటగిరీలకు వచ్చిన స్కోర్ల ఆధారంగా ఈ ర్యాంకు కేటాయించారు. బడ్జెట్, భిన్నత్వం, మానవ వనరులు, మౌలిక వసతులు, పని భారం తదితర అంశాల్లో మెరుగైన పనితీరుకు స్కోరు అందించారు. నాలుగు కేటగిరీల్లో వచ్చిన స్కోరు ఆధారంగా ర్యాంకు కేటాయించారు. ఇందుకోసం 2015-16, 2016-17, 2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించిన డేటాను ఉపయోగించారు.

Current Affairs


క్విక్ రివ్యూ :
ఏమిటి :
‘ఇండియా జస్టిస్’ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : మహారాష్ట్ర
ఎక్కడ : దేశంలో

మాదిరి ప్రశ్నలు
1. టాటా ట్రస్ట్ రూపొందించిన ‘ఇండియా జస్టిస్’ ర్యాంకింగ్స్‌లో 18 పెద్ద రాష్ట్రాల కేటగిరీలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది?
1. ఆంధ్రప్రదేశ్
2. మహారాష్ట్ర
3. మధ్యప్రదేశ్
4. ఉత్తరప్రదేశ్
సమాధానం : 2

2. టాటా ట్రస్ట్ రూపొందించిన ‘ఇండియా జస్టిస్’ ర్యాంకింగ్స్‌లో 18 పెద్ద రాష్ట్రాల కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో ర్యాంకును దక్కించుకుంది.
1. 13
2. 12
3. 15
4. 18
సమాధానం : 1
Published date : 08 Nov 2019 05:55PM

Photo Stories