Skip to main content

జపాన్‌లో అత్యవసర పరిస్థితి విధింపు

కోవిడ్-19(క‌రోనా వైర‌స్‌) తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జపాన్‌లో అత్యవసర పరిస్థితిని ప్రక‌టించారు.
Current Affairs

నెల రోజులపాటు ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు జ‌పాన్ ప్రధానమంత్రి షింజో అబె ఏప్రిల్ 7న ప్రక‌టించారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై రాష్ట్రాలకు పూర్తి అధికారాలు ఇచ్చామ‌ని తెలిపారు. క‌రోనా తీవ్రత నేప‌థ్యంలో ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో కరోనాపై పోరుకు 993బిలియన్‌ డాలర్ల విలువైన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీకి ఆమోదం తెలిపిన‌ట్లు వివ‌రించారు.


భారత్‌లో కోవిడ్‌–19
పరీక్షలు విస్తృతంగా జరగాలి
భారత్‌లో కరోనా వ్యాప్తి, తద్వారా సమాజం, ఆర్థిక రంగాలపై పడే ప్రభావంపై కచ్చితంగా ఒక అంచనాకు రావాలంటే కనీసం 10 లక్షల మందికైనా కరోనా పరీక్షలు జరగాలని బ్రిటన్‌కు చెందిన ఏసీఏఎల్‌ఎమ్‌ సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడించింది. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే కరోనా పరీక్షలు విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉందని ఆ సంస్థ సిఫారసు చేసింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : అత్యవసర పరిస్థితి విధింపు
ఎప్పుడు : ఏప్రిల్ 7
ఎవరు : జ‌పాన్ ప్రధానమంత్రి షింజో అబె
ఎక్కడ : జ‌పాన్
ఎందుకు : కోవిడ్-19(క‌రోనా వైర‌స్‌) తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో
Published date : 08 Apr 2020 05:47PM

Photo Stories