జపాన్ ప్రధాని పదవిని వీడనున్న షింజో అబె
Sakshi Education
ప్రపంచంలోనే ఆర్థికంగా శక్తిమంతమైన మూడో దేశమైన జపాన్‌ను సుదీర్ఘకాలం పరిపాలించిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన షింజో అబె అనారోగ్య కారణాలతో పదవి వీడనున్నారు.
ఆగస్టు 31న పదవి నుంచి వైదొలుగుతానని ఆగస్టు 28న షింజో అబె ప్రకటించారు. తాను అనుకున్న లక్ష్యాలను చేరుకోకుండానే పదవి వీడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యుక్త వయసులో ఉన్నప్పట్నుంచి అల్సరేటివ్ కాలిట్స్ అనే పెద్ద పేగుకి సంబంధించిన సమస్యతో అబె బాధపడుతున్నారు.
చదవండి: జపాన్ ప్రధాని షింజో అబే అరుదైన ఘనత
2006లో తొలిసారిగా జపాన్‌కు ప్రధాని అయిన 65 ఏళ్ల అబె అనారోగ్య సమస్యలతో ఏడాదికే రాజీనామా చేశారు. తిరిగి 2012లో అధికారంలోకి వచ్చిన ఆయన తన ఆర్థిక విధానాలతో గుర్తింపు పొందారు. 2021 ఏడాది సెప్టెంబర్‌తో ఆయన పదవీకాలం ముగిసిపోతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జపాన్ ప్రధాని పదవికి రాజీనామా చేస్తా
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : షింజో అబె
ఎందుకు : అనారోగ్య కారణాలతో

Published date : 29 Aug 2020 05:27PM