జమ్మూకశ్మీర్‌లోకి టర్కీ కిరాయి సైనికులు
Sakshi Education
భారత్‌లోని కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లోకి టర్కీ... తూర్పు సిరియా నుంచి కిరాయి సైనికులను పంపుతోందని ఏఎన్‌ఎఫ్ న్యూస్ తెలిపింది.
ఈ విషయమై సిరియాలోని సులేమన్‌షా బ్రిగేడ్‌స టైస్టు ఆర్గనైజేషన్ ప్రతినిధి అబు ఇమ్‌షా తన అనుచరులతో చర్చించారని పేర్కొంది. కశ్మీర్‌కు వెళ్లే వారికి 2 వేల డాలర్లు ముడతాయని అబు ఇమ్‌షా చెప్పాడని వివరించింది. ఇదంతా టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ పన్నాగమని గ్రీకు జర్నలిస్టు అండ్రియాస్ మౌంట్‌జొరాలియస్ ఒక నివేదికలో వెల్లడించారు.
జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి తొలగించిన సందర్భంలో టర్కీ పాకిస్తాన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేసింది. అలాగే పలుమార్లు పాక్‌కు అంతర్జాతీయ వేదికలపై కూడా టర్కీ మద్దతిస్తోంది.
టర్కీ రాజధాని: అంకారా; కరెన్సీ: టర్కీస్ లీరా

Published date : 05 Dec 2020 06:09PM