జమాత్ ఉద్ దవా ఉగ్ర సంస్థ పై పాక్ నిషేధం
Sakshi Education
2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్ ఉద్ దవా ఉగ్ర సంస్థ, దాని అనుబంధ దాతృత్వ సంస్థ ఫలాహె ఇన్సానియత్‌లను పాక్ ప్రభుత్వం ఫిబ్రవరి 21న నిషేధించింది.
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రపంచవ్యాప్త ఒత్తిడిని తగ్గించేందుకు వీటిని నిషేధించినట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ హోం శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. అన్ని నిషేధిత సంస్థలపైనా చర్యలను వేగవంతం చేయాల్సిందిగా నిర్ణయించినట్లు తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జమాత్ ఉద్ దవా ఉగ్ర సంస్థ పై పాక్ నిషేధం
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : హఫీజ్ సయీద్
ఎక్కడ : పాకిస్థాన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : జమాత్ ఉద్ దవా ఉగ్ర సంస్థ పై పాక్ నిషేధం
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : హఫీజ్ సయీద్
ఎక్కడ : పాకిస్థాన్
Published date : 22 Feb 2019 05:03PM