Skip to main content

జల్‌జీవన్‌ మిషన్‌ ఎప్పుడు ప్రారంభమైంది?

దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని 7 కోట్ల గృహాలకు జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా కుళాయి కనెక్షన్లు అందించినట్లు మార్చి 29న కేంద్ర జల్‌శక్తి శాఖ వెల్లడించింది.
Current Affairs
2019 ఆగస్టు నాటికి 3 కోట్ల కుళాయి కనెక్షన్లు ఉండగా తాజాగా ఈ పథకం ద్వారా రికార్డు స్థాయిలో ఇప్పటికి 4,00,37,853 కనెక్షన్లు అందించామని దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కుళాయి కనెక్షన్ల సంఖ్య 7,24,00,691కి చేరిందని వివరించింది. జల్‌జీవన్‌ మిషన్‌ విజయానికి ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం కాకిస్‌నూర్‌ గ్రామం ఒక నిదర్శనమని పేర్కొంది.

2019, ఆగస్టు 15న...
దేశంలో 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని గృహాలకు కుళాయిల ద్వారా సురక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో జలజీవన్‌ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 2019, ఆగస్టు 15న ఈ మిషన్‌ ప్రారంభమైంది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
గ్రామీణ ప్రాంతాల్లోని 7 కోట్ల గృహాలకు జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా కుళాయి కనెక్షన్లు అందించాం
ఎప్పుడు : మార్చి 29
ఎవరు : కేంద్ర జల్‌శక్తి శాఖ
ఎక్కడ : దేశవ్యాప్తంగా...
ఎందుకు : దేశంలో 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని గృహాలకు కుళాయిల ద్వారా సురక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో
Published date : 31 Mar 2021 11:18AM

Photo Stories