జీవితకాల గరిష్టస్థాయికి ఫారెక్స్ నిల్వలు
Sakshi Education
విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వ్స్) జీవితకాల గరిష్టస్థాయికి చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 28న తెలిపింది. 2019, జూన్ 21తో ముగిసిన వారంలో ఏకంగా 4.215 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 426.416 బిలియన్ డాలర్లకు ఫారెక్స్ నిల్వలు ఎగశాయనిఆర్‌బీఐ వెల్లడించింది.
గణనీయంగా పెరిగిన విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు, రూపాయి మారకం విలువ స్థిరంగా ఉండడం వంటి సానుకూల అంశాలు ఇందుకు సహకరించాయని పేర్కొంది. 2018 ఏడాది ఏప్రిల్ 13న విదేశీ మారక నిల్వలు 426.028 బిలియన్ డాలర్లకు చేరి జీవితకాల గరిష్ట స్థాయిని నమోదుచేసిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జీవితకాల గరిష్టస్థాయికి ఫారెక్స్ నిల్వలు
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : జీవితకాల గరిష్టస్థాయికి ఫారెక్స్ నిల్వలు
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
Published date : 29 Jun 2019 06:05PM