జీశాట్-31 ప్రయోగం విజయవంతం
Sakshi Education
దేశ సమాచార వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రయోగించిన జీశాట్-31 సమాచార ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
ఫ్రాన్స్ దేశానికి చెందిన ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఫిబ్రవరి 6న ఏరియన్-5 ఉపగ్రహ వాహక నౌక (రాకెట్ వీఏ 247) ద్వారా జీశాట్-31 ప్రయోగం చేపట్టారు. జీశాట్-31తోపాటు సౌదీఅరేబియాకి చెందిన 1/హెల్లాస్ శాట్-4 జియోస్టేషనరీ శాటిలైట్‌ను కూడా అంతరిక్షంలోకి పంపారు.
జీశాట్-31 ఉపగ్రహాన్ని పెరిజీ (భూమికి దగ్గరగా) 250 కిలోమీటర్లు, అపోజి (భూమికి దూరంగా) 35,850 కిలోమీటర్ల ఎత్తులోని దీర్ఘ వృత్తాకార భూ బదిలీ కక్ష్యలో 3.0 డిగ్రీల కోణంలో విజయవంతంగా ప్రవేశ పెట్టారు. ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత బెంగళూరు సమీపంలోని హసన్‌లో ఉన్న మిషన్ కంట్రోల్ సెంటర్ శాస్త్రవేత్తలు తమ అధీనంలోకి తీసుకున్నారు. భూ బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహాన్ని రెండు మూడు విడతల్లో భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియను చేపట్టనున్నారు.
జీశాట్-31 ఉపగ్రహ విశేషాలు...
క్విక్ రివ్యూ :
ఏమిటి : జీశాట్-31 ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)
ఎక్కడ : కౌరు అంతరిక్ష కేంద్రం, ఫ్రెంచ్ గయానా, ఫ్రాన్స్

- జీశాట్-31ను బెంగళూరులోని యూఆర్ రావు ఉపగ్రహ పరిశోధన కేంద్ర డెరైక్టర్ కున్హికృష్ణన్ పర్యవేక్షణలో సుమారు రూ.400 కోట్ల వ్యయంతో తయారు చేశారు.
- సుమారు 2,536 కిలోలు బరువున్న ఈ ఉపగ్రహంలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం గల అత్యంత శక్తివంతమైన కేయూ బాండ్ ట్రాన్స్ ఫాండర్ల వ్యవస్థను అమర్చారు.
- 15 ఏళ్లపాటు సేవలందించనుంది.
- ఇస్రోకి చెందిన 40వ కమ్యూనికేషన్ ఉపగ్రహం.
- ఇది ఇన్‌శాట్, జీశాట్ ఉపగ్రహాలకు ఆధునిక రూపంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
- ఇస్రో గతంలో ప్రయోగించిన ఇన్‌శాట్-4సీఆర్, ఇన్‌శాట్-4ఏ సమాచార ఉపగ్రహాల కాలపరిమితి త్వరలో ముగియనుంది. ఈ రెండు ఉపగ్రహాల స్థానాన్ని కూడా జీశాట్-31 ఉపగ్రహం భర్తీ చేయనుంది.
- ఈ ఉపగ్రహం ముఖ్యంగా భారత భూభాగం, ద్వీపాలు, అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్ర పరిసరాలను పర్యవేక్షించి తగిన సమాచారాన్ని అందించనుంది.
- జీశాట్-31 ద్వారా వీశాట్‌నెట్‌వర్క్స్, టెలివిజన్ అప్‌లింక్స్, డిజిటల్ శాటిలైట్ న్యూస్ గ్యాదరింగ్, సెల్యులార్ బ్యాకప్, డీటీహెచ్ టెలివిజన్ సర్వీసులు, స్టాక్ ఎక్చ్సేంజీ, ఈ-గవర్నెన్స్, ఏటీఎం సేవలన్నీ మెరుగుపడే అవకాశం ఉంది.
- జీశాట్-31 నూతన టెలి కమ్యూనికేషన్ అప్లికేషన్లకు అవసరమైన సమాచారాన్ని పెద్దమొత్తంలో ట్రాన్స్ ఫర్ చేయనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జీశాట్-31 ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)
ఎక్కడ : కౌరు అంతరిక్ష కేంద్రం, ఫ్రెంచ్ గయానా, ఫ్రాన్స్
Published date : 07 Feb 2019 06:06PM