జీడీపీ వృద్ధి అంచనాలు 5 శాతానికి తగ్గింపు: శక్తికాంత దాస్
Sakshi Education
ముంబై: విశ్లేషకులు, బ్యాంకర్ల అంచనాలకు భిన్నంగా ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మరోసారి రేట్ల కోతకు వెళ్లకుండా యథాతథ పరిస్థితికి మొగ్గు చూపించింది.
ప్రస్తుతమున్న రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ) 5.15 శాతం, రివర్స్ రెపో రేటు (బ్యాంకుల నుంచి ఆర్‌బీఐ తీసుకునే నిధులపై చెల్లించే వడ్డీ) 4.90 శాతాన్ని అలాగే కొనసాగించాలని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అధ్యక్షతన సమావేశమైన ఆరుగురు సభ్యుల ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. దేశ జీడీపీ వృద్ధిరేటు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 4.5 శాతానికి పడిపోవడంతో (ఆరేళ్ల కనిష్ట స్థాయి), ఒకవైపు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆర్‌బీఐ ఎంపీసీ.. కనీసం పావు శాతం వరకు రెపో రేటును తగ్గిస్తుందని విశ్లేషకులు, నిపుణులు ఊహించారు. అయితే, ద్రవ్యోల్బణం పెరిగిపోతుండటం, రానున్న కాలంలో మరింతగా పెరిగే అవకాశాలుండటం రేట్ల కోతకు వెళ్లకుండా అడ్డుపడ్డాయి. అంతేకాదు, తాజా స్థూల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న ఎంపీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) జీడీపీ వృద్ధి అంచనాలను ఏకంగా 5%కి తగ్గించేసింది. అక్టోబర్ సమీక్షలో వృద్ధి అంచనాను 6.1%గా పేర్కొనటం గమనార్హం. తన సర్దుబాటు విధానాన్ని ఎంపీసీ కొనసాగించడం ఒక్కటే తాజా భేటీలో సానుకూలత. వృద్ధికి మద్దతుగా అవసరమైనంత వరకు ఇదే విధానం కొనసాగుతుందని పేర్కొంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటే తదుపరి సమావేశాల్లో రేట్ల కోతకు అవకాశం ఉంటుందని సంకేతం పంపింది. అంటే భవిష్యత్తులో ద్రవ్యోల్బణమే వడ్డీ రేట్లను నిర్ణయించగలదని స్పష్టం చేసింది. అంతేకాదు, తదుపరి రేట్ల కోత రానున్న బడ్జెట్‌పైనా ఆధారపడి ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ చెప్పారు.
ద్రవ్యోల్బణం పెరగొచ్చు :
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.7-5.1 శాతం మధ్య.. 2020-21 మొదటి అర్ధభాగంలో 4.3-4.8 శాతం మధ్య ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. ‘‘నాలుగో త్రైమాసికంలో (వచ్చే జనవరి-మార్చి) ఆహార ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లో ఉండొచ్చు. రానున్న నెలల్లో ఇది నియంత్రణలోకి రావడం అన్నది ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంది. కూరగాయల ధరల పెరుగుదల ఒకటి, రెండు నెలలు కొనసాగొచ్చు. ఖరీఫ్‌లో ఆలస్యంగా వేసిన పంటల దిగుబడులు, సరఫరా దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో 2020 ఫిబ్రవరికి కూరగాయల ధరలు శాంతించొచ్చు. టెలికం చార్జీలు పెంచడం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుంది. అయితే, టోకు ద్రవ్యోల్బణం మాత్రం ప్రస్తుత స్థాయి 4 శాతం లోపే కొనసాగొచ్చు’’ అని ఆర్‌బీఐ ఎంపీసీ పేర్కొంది. అక్టోబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.6 శాతానికి చేరిన విషయం తెలిసిందే. 4 శాతానికి కట్టడి చేయాలన్నది ఆర్‌బీఐ లక్ష్యం.
వృద్ధి 5 శాతం :
2019-20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 5 శాతం మేరే ఉండొచ్చని ఎంపీసీ పేర్కొంది. 6.1 శాతంగా ఉండొచ్చన్న గత అంచనాలను సవరించింది. 2019-20 రెండో అర్ధభాగంలో (2019 అక్టోబర్- 2020 మార్చి) వృద్ధి రేటు 4.9-5.5 శాతం మధ్య.. 2020-21 మొదటి ఆరు నెలల కాలంలో 5.9-6.3 శాతం మధ్య ఉంటుందని ఆర్‌బీఐ ఎంపీసీ అంచనా వేసింది. రానున్న కేంద్ర బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు, వృద్ధిపై వాటి ప్రభావం విషయమై స్పష్టత వస్తుందని పేర్కొంది. డిమాండ్ పరిస్థితులు బలహీనంగా ఉన్నట్టు ఎన్నో అంశాలు స్పష్టం చేస్తున్నాయని అభిప్రాయపడింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జీడీపీ వృద్ధి అంచనాలు 5 శాతానికి తగ్గింపు
ఎప్పుడు: డిసెంబర్ 5, 2019
ఎవరు: ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్
ఎక్కడ: ముంబై
ఎందుకు: దేశ జీడీపీ వృద్ధిరేటు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 4.5 శాతానికి పడిపోవడంతో..

Published date : 06 Dec 2019 06:20PM