Skip to main content

జీడీపీ అంచనాలపై ఎస్‌బీఐ రూపొందించిన నివేదిక పేరు?

2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అనే అంశంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ‘ఎకోర్యాప్’ పేరుతో ఒక పరిశోధనా నివేదికను సెప్టెంబర్ 1న విడుదల చేసింది.
Current Affairs
ప్రస్తుత ఆర్థిక ఏడాది భారత జీడీపీ మెనస్ 10.9 శాతం వరకు క్షీణిస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది. భారత జీడీపీ మైనస్ 6.8 శాతంగా ఉండొచ్చని ఎస్‌బీఐ గతంలో అంచానా వేసింది. తాజాగా మైనస్ 10.9 శాతానికి పెంచింది.

చదవండి: ప్రభుత్వ గణాంకాల ప్రకారం... 2020-21 ఆర్థిక ఏడాదిలో మొదటి త్రైమాసిక జీడీపీ ఏంత శాతం క్షీణతను నమోదు చేసుకుంది?

ఆరు జట్లకు స్పాన్సర్‌గా బీకేటీ టైర్స్
ఐపీఎల్ 13వ సీజన్లో పాల్గొంటున్న ఆరు జట్లకు స్పాన్సర్ చేయనున్నట్టు టైర్ల తయారీ సంస్థ బీకేటీ టైర్స్ వెల్లడించింది. వీటిలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్‌‌స, ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్‌‌స ఎలెవన్ పంజాబ్, కోల్‌కత నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ఉన్నాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : 2020-21 ఆర్థిక ఏడాది భారత జీడీపీ మెనస్ 10.9 శాతం వరకు క్షీణిస్తుంది
ఎప్పుడు : సెప్టెంబర్ 1
ఎవరు : ఎస్‌బీఐ ఎకోర్యాప్ నివేదిక
ఎందుకు : కరోనా నేపథ్యంలో...
Published date : 02 Sep 2020 05:36PM

Photo Stories