జీఐబీఎన్‌ఏ సవరణలకు కేంద్రం కేబినెట్ ఆమోదం
Sakshi Education
ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీల ప్రైవేటీకరణకు ఉద్దేశించిన జీఐబీఎన్‌ఏ (జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్– నేషనలైజేషన్ యాక్ట్) సవరణలకు కేంద్రం కేబినెట్ జూలై 28న ఆమోదముద్ర వేసింది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రైవేటీకరణ చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన 2021–22 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ బాధ్యతను నీతి ఆయోగ్‌కు అప్పగించడమూ జరిగింది. ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమకూర్చుకోవాలన్నది బడ్జెట్ లక్ష్యం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జీఐబీఎన్‌ఏ (జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్– నేషనలైజేషన్ యాక్ట్) సవరణలకు ఆమోదం
ఎప్పుడు : జూలై 28
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీల ప్రైవేటీకరణ కోసం...
క్విక్ రివ్యూ :
ఏమిటి : జీఐబీఎన్‌ఏ (జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్– నేషనలైజేషన్ యాక్ట్) సవరణలకు ఆమోదం
ఎప్పుడు : జూలై 28
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీల ప్రైవేటీకరణ కోసం...
Published date : 02 Aug 2021 06:27PM