Skip to main content

జగనన్న తోడు పథకం కింద చిన్న, వీధి వ్యాపారాలకు ఎంత మొత్తాన్ని రుణంగా అందించనున్నారు?

2020, నవంబర్ 24న ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది.

Current Affairs


నవంబర్ 5న సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో చిన్న, వీధి వ్యాపారాలు చేసుకునే వారు, చేతి వృత్తుల కళాకారులకు వడ్డీ లేకుండా ‘జగనన్న తోడు’ పథకం కింద రూ.10 వేల వడ్డీ లేని రుణం ఇవ్వనున్నారు. ఈ పథకానికి రూ.వెయి్య కోట్లు కేటాయించారు.

కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు...

  • కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రంలో మెరుగైన ఇసుక విధానానికి ఆమోదం. ఇకపై ఆఫ్‌లైన్‌లోనే ప్రజలు ఇసుక పొందే అవకాశం.
  • 2020, నవంబరు 17న ప్రారంభించనున్న వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకానికి ఆమోదం.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌డీసీ)ను బలోపేతం చేయడంతో పాటు ఆ సంస్థకు చట్టబద్దత కల్పించడం కోసం శాసనసభలో ప్రవేశపెట్టనున్న ముసాయిదా బిల్లుకు ఆమోదం.
  • రూ.700 కోట్ల పెట్టుబడితో ఇంటిలిజెంట్ సెజ్ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో పాదరక్షల తయారీ యూనిట్, రూ.1,050 కోట్లతో ఏటీసీ టైర్ల తయారీ కంపెనీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కంపెనీల వల్ల 36,900 మందికి ఉపాధి లభిస్తుంది.
  • 2021, జనవరి 1 నుంచి లబ్ధిదారుల ఇంటికే నాణ్యమైన (సార్టెక్స్) రేషన్ బియ్యం సరఫరా చేస్తారు. ప్రస్తుతం ఈ విధానం శ్రీకాకుళం జిల్లాలో పెలైట్ ప్రాజెక్టుగా అమలవుతోంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : 2020, నవంబర్ 24న ‘జగనన్న తోడు’ పథకం ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : ఏపీ మంత్రి మండలి
ఎందుకు : వీధి వ్యాపారాలు, చేతి వృత్తుల కళాకారులకు వడ్డీ లేకుండా రూ.10 వేల వడ్డీ లేని రుణం కల్పించేందుకు
Published date : 06 Nov 2020 06:02PM

Photo Stories