Skip to main content

జార్ఖండ్‌ ఎన్నికల్లో జేఎంఎం కూటమి విజయం

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీల కూటమి విజయం సాధించింది.
Current Affairs డిసెంబర్‌ 23న జార్ఖండ్‌ ఎన్నికల సంఘం ఫలితాలను వెల్లడించింది. మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్‌ అసెంబ్లీలో 47 సీట్లను కూటమి అభ్యర్థులు గెలుచుకున్నారు. అధికార పార్టీ బీజేపీ 25 స్థానాలకే పరిమితమైంది. కూటమిలో జేఎంఎం 30 స్థానాల్లో, కాంగ్రెస్‌ 16 సీట్లలో, ఆర్జేడీ ఒక స్థానంలో గెలుపొందాయి. బీజేపీకి 33.53 శాతం, జేఎంఎంకు 19.29 శాతం, కాంగ్రెస్‌కు 13.78 శాతం, ఆర్జేడీకి 2.82 శాతం, ఏజేఎస్‌యూకి 8.15 శాతం, ఎంఐఎంకు 1.08 శాతం ఓట్లు లభించాయి.

ముఖ్యమంత్రి రాజీనామా
ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి, బీజేపీ నేత రఘుబర్‌ దాస్‌ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్‌ ద్రౌపది ముర్ముకి అందించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్‌ తనను కోరారని రఘుబర్‌ తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రతిష్టాత్మక జంషెడ్‌పూర్‌(ఈస్ట్‌) స్థానం నుంచి సీఎం రఘుబర్‌ దాస్‌ పోటీ చేశారు. ఆయనపై బీజేపీ రెబెల్‌ అభ్యర్థి సరయు రాయ్‌ గెలుపొందారు.

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
  • మొత్తం స్థానాలు 81

పార్టీ

2014

2019

జేఎంఎం

10

30

కాంగ్రెస్‌

6

16

బీజేపీ

37

25

ఏజేఎస్‌యూ

5

02

జేవీఎం(పీ)

8

03

ఇతరులు

6

05

Published date : 24 Dec 2019 05:55PM

Photo Stories