జాపట్ పరిధిలోకి అర్బన్ ఫారెస్ట్ పార్కులు
Sakshi Education
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కులను ‘జూ, పార్కు అథారిటీ ఆఫ్ తెలంగాణ’(జాపట్) పరిధిలోకి తీసుకొస్తూ రాష్ట్ర అటవీశాఖ సెప్టెంబర్ 2న ఉత్తర్వులు జారీచేసింది.
తెలంగాణలోని జంతు ప్రదర్శన శాలలు, జింకల పార్కులు, నేషనల్ కన్జర్వేషన్ పార్కుల నిర్వహణకు 2014 ఆగస్టులో జాపట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలోని పలుచోట్ల అర్బన్ ఫారెస్ట్ పార్కుల నిర్మాణం పూర్తి కావొస్తుండటంతో వాటి పర్యవేక్షణతో పాటు ఇప్పటికే పూర్తయిన పార్కుల నిర్వహణను జాపట్ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జూ, పార్కు అథారిటీ ఆఫ్ తెలంగాణ(జాపట్) పరిధిలోకి అర్బన్ ఫారెస్ట్ పార్కులు
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎవరు : తెలంగాణ అటవీశాఖ
ఎందుకు : అర్బన్ ఫారెస్ట్ పార్కుల పర్యవేక్షణతో పాటు నిర్వహణ కోసం
క్విక్ రివ్యూ :
ఏమిటి : జూ, పార్కు అథారిటీ ఆఫ్ తెలంగాణ(జాపట్) పరిధిలోకి అర్బన్ ఫారెస్ట్ పార్కులు
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎవరు : తెలంగాణ అటవీశాఖ
ఎందుకు : అర్బన్ ఫారెస్ట్ పార్కుల పర్యవేక్షణతో పాటు నిర్వహణ కోసం
Published date : 05 Sep 2020 05:37PM