Skip to main content

ఈసీబీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా ఆండ్రూ స్ట్రాస్

ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) క్రికెట్ కమిటీ చైర్మన్‌గా ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఆండ్రూ స్ట్రాస్ నియమితులయ్యారు.
ఈ విషయాన్ని సెప్టెంబర్ 13న ఈసీబీ వెల్లడించింది. ప్రస్తుతం ఈసీబీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ ఆష్లే గైల్స్ స్థానంలో స్ట్రాస్ బాధ్యతలు చేపట్టనున్నాడు. స్ట్రాస్ ఇంగ్లండ్ తరఫున 100 టెస్టులు ఆడి 40.91 సగటుతో 7,000కు పైగా పరుగులు సాధించాడు. అతడి నాయకత్వంలో ఇంగ్లండ్ జట్టు రెండు యాషెస్ సిరీస్‌లు గెలిచింది. 2018లో ఈసీబీ డెరైక్టర్ పదవికి స్ట్రాస్ రాజీనామా చేశాడు. 42 ఏళ్ల స్ట్రాస్ సెప్టెంబర్ 10న ప్రతిష్టాత్మక ‘నైట్‌హుడ్’ పురస్కారానికి ఎంపికై న సంగతి తెలిసిందే.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) క్రికెట్ కమిటీ చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : ఆండ్రూ స్ట్రాస్
Published date : 14 Sep 2019 05:39PM

Photo Stories