Skip to main content

ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు పునరుద్ధరణ

ఇరాన్‌పై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలన్నింటినీ పునరుద్ధరిస్తున్నట్టుగా అగ్రరాజ్యం అమెరికా సెప్టెంబర్ 20న ప్రకటించింది.
Current Affairs
2015లో ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందంలోని ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (జేసీపీఓఏ)లో నిబంధనల్ని ఆ దేశం ఉల్లంఘిస్తోందని అమెరికా ఆరోపించింది. భద్రతా మండలి చట్టాల ప్రకారం ఇరాన్ చేస్తున్న పనులు సరైనవి కావంటూ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఇరాన్‌కు నోటీసులు పంపారు. ఆ నోటీసుల గడువు నెల పూర్తి కాగానే ఆంక్షల్ని విధిస్తున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఆయుధాల నిషేధం సహా అన్ని రకాల ఆంక్షల్ని పునరుద్ధరించామని, యూఎన్ సభ్యదేశంగా తమకి ఆ హక్కు ఉందని అగ్రరాజ్యం పేర్కొంది.

యూఎస్‌కు హక్కు లేదు
2018లో అమెరికా అణు ఒప్పందం నుంచి ఎప్పుడైతే వైదొలిగిందో అప్పుడే ఇరాన్‌పై ఆంక్షలు విధించే హక్కు కోల్పోయిందని ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ అంటున్నాయి. అమెరికా నిర్ణయాలను చైనా, రష్యా ఎప్పట్నుంచో వ్యతిరేకిస్తున్నాయి.

అణు పరీక్షల విషయమై...
అణు పరీక్షల విషయమై 2015లో అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం శుద్ధి చేసిన యురేనియం, భార జలాలను ఎగుమతి చేసి, ఇరాన్ తన వద్ద ఉన్న నిల్వలను తగ్గించుకోవలసి ఉంది. ఆ ఒప్పందం కారణంగానే అప్పట్లో ఇరాన్‌పై ఉన్న ఆంక్షల్లో కొన్నింటిని ఎత్తివేశారు. ఈ అణు ఒప్పందం నుంచి 2018 మే 8న అమెరికా వైదొలిగింది.
 
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇరాన్‌పై ఆంక్షలు పునరుద్ధరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : అమెరికా
ఎందుకు : జేసీపీఓఏలో నిబంధనల్ని ఇరాన్ ఉల్లంఘిస్తోందని
Published date : 21 Sep 2020 05:41PM

Photo Stories