ఇండోనేసియా మాస్టర్స్ టైటిల్ విజేతగా సైనా
Sakshi Education
ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్-500 టోర్నీ విజేతగా భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ నిలిచింది.
ఇండోనేసియా రాజధాని జకార్తాలో జనవరి 27న జరిగిన ఫైనల్లో సైనా ప్రత్యర్థి కరోలినా మారిన్ (స్పెయిన్) తొలి గేమ్‌లోనే కాలి గాయంతో తప్పుకుంది. దీంతో సైనాను విజేతగా ప్రకటించారు. ఆ సమయంలో సైనా 4-10తో వెనుకబడి ఉంది. 2018లో ఇదే టోర్నమెంట్‌లో సైనా రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్-500 టోర్నీ విజేత
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : సైనా నెహ్వాల్
ఎక్కడ : జకార్తా, ఇండోనేసియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్-500 టోర్నీ విజేత
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : సైనా నెహ్వాల్
ఎక్కడ : జకార్తా, ఇండోనేసియా
Published date : 28 Jan 2019 06:29PM