Skip to main content

ఇండోనేసియా అధ్యక్షుడితో మోదీ చ‌ర్చలు

క‌రోనా ఉత్పాతంపై ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతో చర్చించినట్టు ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్ 28న ట్వీట్‌ చేశారు.
Current Affairs

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఉత్పన్నమవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్, ఇండోనేషియా మధ్య సన్నిహిత సహకారం అవసరమని మోదీ ఆకాంక్షించారు. ఈ సంక్షోభ సమయంలో ఇరుదేశాల మధ్య ఔషధ ఉత్పత్తుల సరఫరాకు అంతరాయం కలగకుండా భారత్‌ తనవంతు కృషి చేస్తుందని ఇండోనేషియా అధ్యక్షుడికి హామీ ఇచ్చారు. ఇరుదేశాల మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలు కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ఉపయోగపడతాయని ప్రధాని వ్యాఖ్యానించారు.


వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం

వేసవి సెలవుల్లో కూడా విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పొఖ్రియాల్‌ నిశాంక్ ఏప్రిల్ 28న తెలిపారు. అందుకు రూ.2,600 కోట్లు అదనంగా కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతో చ‌ర్చలు
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : ప్రధాని నరేంద్రమోదీ
ఎందుకు : క‌రోనా ఉత్పాతంపై చ‌ర్చించేందుకు
Published date : 29 Apr 2020 08:24PM

Photo Stories