ఇండియన్ సూపర్ లీగ్ ఏడో సీజన్ ఎక్కడ పారంభమైంది?
Sakshi Education
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఏడో సీజన్ నవంబర్ 20న గోవాలోని బంబోలిమ్‌లో ప్రారంభమైంది. నవంబర్ 20న జరిగిన లీగ్ ఆరంభ మ్యాచ్‌లో ఏటీకే మోహన్ బగాన్ 1-0తో కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ)పై విజయం సాధించింది.
ఈ గెలుపుతో ఏటీకే ఖాతాలో మూడు పాయింట్లు చేరాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిన జరిగే ఈ టోర్నీలో ఈ ఏడాది కొత్తగా స్పోర్టింగ్ క్లబ్ ఈస్ట్ బెంగాల్ వచ్చి చేరడంతో... జట్ల సంఖ్య 11కు చేరింది. కరోనా విరామం అనంతరం దేశంలో జరుగుతున్న తొలి క్రీడా ఈవెంట్ ఇదే. గోవాలోని మూడు స్టేడియాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఏడో సీజన్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 20
ఎక్కడ : బంబోలిమ్, గోవా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఏడో సీజన్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 20
ఎక్కడ : బంబోలిమ్, గోవా
Published date : 21 Nov 2020 05:53PM