ఇండియా టూర్ స్క్వాష్ టోర్నీ విజేతగా హరీందర్
Sakshi Education
భారత స్క్వాష్ రాకెట్స్ సమాఖ్య (ఎస్‌ఆర్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో జరిగిన ఇండియా టూర్ టోర్నమెంట్‌లో భారత ప్లేయర్ హరీందర్ పాల్ సంధూ విజేతగా అవతరించాడు.
ముంబైలో డిసెంబర్ 21న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ హరీందర్ 11-5, 11-6, 11-7తో ఏడో సీడ్ టొమోటకా ఎండో (జపాన్)పై విజయం సాధించాడు. ఇదే టోర్నీ మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్లో హనా రమదాన్ (ఈజిప్ట్) 11-8, 6-11, 11-4, 11-3తో లూసీ టర్మెల్ (ఇంగ్లండ్)ను ఓడించి టైటిల్ దక్కించుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియా టూర్ స్క్వాష్ టోర్నీ విజేత
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : హరీందర్ పాల్ సంధూ
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియా టూర్ స్క్వాష్ టోర్నీ విజేత
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : హరీందర్ పాల్ సంధూ
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
Published date : 23 Dec 2019 05:31PM