Skip to main content

ఈజిప్టు నుంచి 6వేల టన్నుల ఉల్లి దిగుమతి

దేశీయంగా ఉన్న కొరత, పెరుగుతున్న ధరను దృష్టిలో పెట్టుకుని ఈజిప్టు నుంచి 6వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోవాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.
Current Affairsదీనిని కిలో రూ.52-60 స్థాయిలో రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. సుమారు 1.2 లక్షల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోవాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈజిప్టు నుంచి మొదటి విడతగా 6,090 టన్నుల ఉల్లి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఈజిప్టు నుంచి 6,090 టన్నుల ఉల్లి దిగుమతి
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : దేశీయంగా ఉన్న ఉల్లి కొరత నేపథ్యంలో
Published date : 26 Nov 2019 05:50PM

Photo Stories