Skip to main content

ఈజ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల సవరణ

గణాంకాల్లో అవకతవకలను పునఃసమీక్షించిన నేపథ్యంలో 2018 సంవత్సరానికి గాను గతంలో ప్రకటించిన<b> డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌ల‌ను</b> ప్రపంచ బ్యాంకు సవరించింది.
Current Affairs 2016 నుంచి 2020 దాకా డేటా సేకరణ, ర్యాంకుల ప్రచురణలకు మధ్య కాలంలో చోటు చేసుకున్న మార్పులను పరిశీలించిన మీదట తాజా సవరణలు చేసినట్లు ప్రపంచ బ్యాంకు డిసెంబర్ 19న వివరించింది.

సవరణల ప్రకారం... చైనా, సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, అజర్‌బైజాన్ ర్యాంకులు మారాయి. 2018లో చైనాకు 78వ ర్యాంక్ ఇచ్చినప్పటికీ.. తాజాగా డేటాను పునఃసమీక్షించిన మీదట ఇది అంతకన్నా ఏడు స్థానాలు తగ్గి 85వ స్థానానికి పరిమితం కావాల్సిందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.

చదవండి:
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-2019 ర్యాంకుల్లో భారత్ స్థానం?

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-2019 ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ స్థానం?
Published date : 19 Dec 2020 07:28PM

Photo Stories