ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-2019 ర్యాంకులు
విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకమైన సులభతర వాణిజ్య విభాగం(ఈవోడీబీ)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. 2019 ఏడాదికి గాను డీపీఐఐటీ, వరల్డ్ బ్యాంక్ సంయుక్తంగా సులభతర వాణిజ్యం కోసం నిర్దేశించిన 187 సంస్కరణలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలు చేయడం ద్వారా మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది.
ఈవోడీబీ 2019 ర్యాంకులు-ముఖ్యాంశాలు
- తొలిసారిగా పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలను తీసుకొని ప్రకటించడం ఈ ర్యాంకుల ప్రత్యేకత. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు సంస్కరణలు అమలు చేసినట్లు ధృవీకరణ పత్రం ఇస్తే దాని ఆధారంగా ర్యాంకులు ప్రకటించేవారు.
- సంస్కరణలు అమలు అవుతున్నాయా లేదా అన్న విషయాన్ని పారిశ్రామికవేత్తల నుంచి ర్యాండమ్‌గా డీపీఐఐటీ, ప్రపంచ బ్యాంకు సర్వే చేసి 2019 ఏడాది(నాలుగో విడత) ర్యాంకులు ప్రకటించాయి.
- గతేడాది 12వ స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ 10 స్థానాలు ఎగబాకి రెండవ స్థానంలోకి రాగా, రెండో స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈ ఏడాది మూడో స్థానానికి పరిమితమైంది.
- కోవిడ్-19 వల్ల దెబ్బతిన్న పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ పథకాన్ని అత్యధికంగా వినియోగించుకున్న రాష్ట్రంగా ఏపీ రికార్డులకు ఎక్కింది.
ఈవోడీబీ-2019 ర్యాంకులు
సంఖ్య | రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం | ర్యాంకు |
1 | ఆంధ్రప్రదేశ్ | 1 |
2 | ఉత్తరప్రదేశ్ | 2 |
3 | తెలంగాణ | 3 |
4 | మధ్యప్రదేశ్ | 4 |
5 | జార్ఖండ్ | 5 |
6 | ఛత్తీస్‌గఢ్ | 6 |
7 | హిమాచల్ ప్రదేశ్ | 7 |
8 | రాజస్తాన్ | 8 |
9 | పశ్చిమ బెంగాల్ | 9 |
10 | గుజరాత్ | 10 |
11 | ఉత్తరాఖండ్ | 11 |
12 | ఢిల్లీ | 12 |
13 | మహారాష్ట్ర | 13 |
14 | తమిళనాడు | 14 |
15 | లక్షద్వీప్ | 15 |
16 | హరియాణా | 16 |
17 | కర్ణాటక | 17 |
18 | డామన్-డయ్యూ | 18 |
19 | పంజాబ్ | 19 |
20 | అసోం | 20 |
21 | జమ్మూ, కశ్మీర్ | 21 |
22 | అండమాన్, నికోబార్ దీవులు | 22 |
23 | దాద్రా, నగర్ హవేలీ | 23 |
24 | గోవా | 24 |
25 | మిజోరాం | 25 |
26 | బిహార్ | 26 |
27 | పుదుచ్ఛేరి | 27 |
28 | కేరళ | 28 |
29 | అరుణాచల్ ప్రదేశ్ | 29 |
30 | చండీగఢ్ | 29 |
31 | మణిపూర్ | 29 |
32 | మేఘాలయ | 29 |
33 | నాగాలాండ్ | 29 |
34 | ఒడిశా | 29 |
35 | సిక్కిం | 29 |
36 | త్రిపుర | 29 |
జోనల్ స్థాయిలో...
నార్త్‌జోన్‌లో యూపీ, తూర్పు జోన్‌లో జార్ఖండ్, పశ్చిమ జోన్‌లో మధ్యప్రదేశ్, దక్షిణ జోన్‌లో ఏపీ, ఈశాన్య జోన్‌లో అసోం అగ్రస్థానంలో నిలిచాయి.