Skip to main content

ఈఎస్‌పీఎన్ క్రీడా అవార్డులు-2018

2018 సంవత్సరానికిగాను క్రీడాప్రసార సంస్థ ఈఎస్‌పీఎన్ భారత్ ఏప్రిల్ 5న క్రీడా అవార్డులు-2018ను ప్రకటించింది.
ఈ అవార్డుల్లో ఉత్తమ క్రీడాకారిణి (ఫిమేల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్)గా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు నిలిచింది. 2018లో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచి, ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా గుర్తింపు పొందినందుకుగాను సింధుకు ఈ అవార్డు ద క్కింది. పురుషుల విభాగంలో కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు దక్కించుకున్న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఉత్తమ క్రీడాకారుడిగా (మేల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్) ఎంపికయ్యాడు. అలాగే ఆసియా క్రీడల్లో, లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకున్న సైనా నెహ్వాల్‌కు కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది.

ఈఎస్‌పీఎన్ క్రీడా అవార్డులు-2018

అవార్డు

విజేత

ఉత్తమ క్రీడాకారిణి

పీవీ సింధు

ఉత్తమ క్రీడాకారుడు

నీరజ్ చోప్రా

కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

సైనా నెహ్వాల్

కోచ్ ఆఫ్ ది ఇయర్

జస్పాల్ రాణా(షూటింగ్)

టీమ్ ఆఫ్ ది ఇయర్

మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు

ఎమర్జింగ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్

సౌరభ్ చౌధరి (షూటర్)

జీవితకాల పురస్కారం

ప్రదీప్ కుమార్ బెనర్జీ (ఫుట్‌బాల్)


ఆసియా క్రీడల్లో 4x400మీ రిలేలో భారత మహిళల అథ్లెటిక్ స్వర్ణం సాధించిన క్షణం ‘మూమెంట్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచింది. అలాగే అత్యుత్తమ మ్యాచ్‌గా బాక్సింగ్‌లో హసన్‌బోయ్ దుమతోవ్(రష్యా)తో అమిత్ పంగల్ జరిపిన పోరుఎంపికైంది. దివ్యాంగ కేటగిరీలో అథ్లెట్ ఆఫ్ ది ఇయర్‌గా ఏక్తా భ్యాన్‌కు అవార్డు దక్కింది. 2018లో మొత్తం 11 క్రీడాంశాల్లో ప్రతిభ చూపిన 10 మంది క్రీడాకారులకు ఈ అవార్డులకు ఎంపిక చేశారు.
 క్విక్ రివ్యూ   :
 ఏమిటి : ఈఎస్‌పీఎన్ క్రీడా అవార్డులు-2018    
 ఎప్పుడు : ఏప్రిల్ 5
 ఎవరు : క్రీడాప్రసార సంస్థ ఈఎస్‌పీఎన్ భారత్
 ఎక్కడ : భారత్ 
Published date : 06 Apr 2019 05:49PM

Photo Stories