ఇది సామాన్యుల బడ్జెట్ : మంత్రి నిర్మలా
Sakshi Education
ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండో సారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది సామాన్యుల బడ్జెట్ అని ఆమె అభివర్ణించారు.
ఆర్థిక ప్రగతికి సంస్కరణలు అవసరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారత ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని.. జీఎస్టీ అమలు చారిత్రాత్మక నిర్ణయమని.. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని చెప్పుకొచ్చారు. బ్యాంకులు పేరుకుపోయిన ఎన్పీయేల నుంచి బయటపడుతున్నాయని.. ఇప్పటి వరకు 40కోట్ల మంది జీఎస్టీ రిటర్నులు దాఖలు చేశారు. నగదు బదిలీ పథకంతో నేరుగా ప్రజల బ్యాంకు ఖతాలోకి సోమ్ము చేరుతుందని తెలిపారు. 280 మిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు సమకూరాయని.. ప్రపంచంలో భారత్ అయిదో ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. ఆయుష్మాన్ భవ.. పథకంతో అద్భుతమైన ఫలితాలు సాధించినట్లు ఆమె అన్నారు. ‘నిర్మాణాత్మక చర్యలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నాం. కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే దేశం వేగంగా ముందుకెళ్తుంది. సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ సబ్‌కా విశ్వాస్ ఈ ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి నేరుగా నిరుపేదలకు అందించేందుకు ప్రయత్నం.’ అని మంత్రి పేర్కొన్నారు.
Published date : 01 Feb 2020 11:41AM