Skip to main content

ఇడాయ్ తుపాన్ కోసం మూడు నౌకలు

ఇడాయ్ తుపాన్ ప్రభావం వల్ల అతలాకుతలమైన మొజాంబిక్, మాల్వాయి, జింబాబ్వే దేశాల్లో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు భారత్ మూడు నౌకలను ఆయా దేశాలకు పంపి సహాయ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.
మొజాంబిక్ దేశం చేసిన వినతి మేర స్పందించిన భారత్ ఆహారం, దుస్తులు, ఔషధాలతో కూడిన మూడు నౌకలను బెయిరా నౌకాశ్రయానికి పంపించింది. ఈ మేరకు భారత ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి టీఎస్ తిరుమూర్తి మార్చి 18న తెలిపారు. 1.5 మిలియన్ల మంది ఇడాయ్ తుపాన్ బారిన పడ్డారని అంచనా.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మూడు నౌకల్లో సహాయ సామగ్రి
ఎప్పుడు : మార్చి 18
ఎవరు : భారత్
ఎందుకు : ఇడాయ్ తుపాన్ ప్రభావం వల్ల అతలాకుతలమైన మొజాంబిక్, మాల్వాయి, జింబాబ్వే దేశాల్లో సహాయ కార్యక్రమాల కోసం
Published date : 19 Mar 2019 05:06PM

Photo Stories