ఈ ప్లూటో ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ
Sakshi Education
ప్యూర్ ఈవీ అనే సంస్థ ఐఐటీ-హైదరాబాద్ సాయంతో అభివృద్ధి చేసిన ‘ఈ ప్లూటో 7జీ’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నీతి ఆయోగ్ సభ్యుడు, డీఆర్‌డీవో మాజీ డెరైక్టర్ డాక్టర్ వి.కె.సారస్వత్, డీఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి హైదరాబాద్‌లో ఫిబ్రవరి 9న ఆవిష్కరించారు.
అనంతరం సతీష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఐఐటీ హైదరాబాద్ వంటి సంస్థలు రక్షణ రంగానికి ఉపయోగపడే పరికరాలు, టెక్నాలజీ అభివృద్ధికి ప్రయత్నించాలన్నారు. విద్యుత్ బ్యాటరీల తయారీకి కీలకమైన లిథియం పదార్థాన్ని దక్షిణ అమెరికా దేశాలైన అర్జెంటీనా, చిలీ, బొలీవియా నుంచి సేకరించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని సారస్వత్ పేర్కొన్నారు. ఈప్లూటో 7జీ ధర రూ. 79,999లని ప్యూర్ ఈవీ సీఈవో రోహిత్ వడేరా తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈ ప్లూటో 7జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎవరు : నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె.సారస్వత్, డీఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి
ఎక్కడ : హైదరాబాద్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈ ప్లూటో 7జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎవరు : నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె.సారస్వత్, డీఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి
ఎక్కడ : హైదరాబాద్
Published date : 10 Feb 2020 05:52PM