Skip to main content

ఈ–లెర్నింగ్‌ యాప్‌ అభ్యాస ఆవిష్కరణ

ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం విద్యా శాఖ రూపొందించిన ఈ –లెర్నింగ్‌ యాప్‌ ‘అభ్యాస’ ను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏప్రిల్ 23న సచివాలయంలో ఆవిష్కరించారు.
Current Affairs

లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్కూళ్ల మూతపడటంతో సమయ సద్వినియోగానికి, విద్యార్థుల అక్షరాస్యతను మరింత మెరుగుపర్చడానికిగాను ‘అభ్యాస’ను రూపకల్పన చేసినట్లు మంత్రి తెలిపారు. ఒకటి నుంచి ఐదో తరగతులకు సంబంధించిన జనరల్‌ ఇంగ్లీష్‌, గణితం, భౌతిక, జీవ, సాంఘిక శాస్త్రాల పాఠాల వీడియోలు, ఆన్‌లైన్‌ పరీక్షలు ఇందులో అందుబాటులో ఉంటాయని వివరించారు.


గన్నవరం టెర్మినల్‌ నిర్మాణానికి పీఐబీ ఆమోదం

గన్నవరం విమానాశ్రయంలో దేశీయ, విదేశీయ ప్రయాణికుల కోసం నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు (పీఐబీ) ఆమోదం తెలిపింది. సుమారు రూ.613 కోట్లతో నిర్మించనున్న ఈ టెర్మినల్‌ నిర్మాణానికి కేంద్ర కేబినెట్‌ ఇక లాంఛనంగా ఆమోదం తెలపాల్సి ఉంది. ప్రసుత్తం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో పాత టెర్మినల్‌ భవనాన్ని ఇంటర్నేషనల్‌ కార్యకలపాలకు తాత్కాలికంగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు దీని స్థానంలో 31 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ను నిర్మించనున్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఈ–లెర్నింగ్‌ యాప్‌ అభ్యాస ఆవిష్కరణ
ఎప్పుడు : ఏప్రిల్ 23
ఎవరు : ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
ఎందుకు : ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం
Published date : 24 Apr 2020 07:06PM

Photo Stories