హంగేరి ఓపెన్‌లో సత్యన్-శరత్ జంటకు రజతం
Sakshi Education
అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) హంగేరి ఓపెన్ వరల్డ్ టూర్ టోర్నమెంట్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్-ఆచంట శరత్ కమల్ (భారత్) జంట రజత పతకం సాధించింది.
హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో ఫిబ్రవరి 23న జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సత్యన్-శరత్ కమల్ ద్వయం 5-11, 9-11, 11-8, 9-11తో డుడా బెనెడిక్ట్-ఫ్రాన్సిస్కా ప్యాట్రిక్ (జర్మనీ) జంట చేతిలో ఓడిపోయింది. ఈ టోర్నీలో శరత్‌కిది రెండో పతకం. మిక్స్‌డ్ డబుల్స్‌లో మనిక బాత్రా (భారత్)తో కలిసి శరత్ కాంస్య పతకం సాధించాడు.
మరోవైపు స్వీడన్‌లో జరిగిన స్వీడిష్ జూనియర్, క్యాడెట్ ఓపెన్ టీటీ టోర్నీలో చెన్నైకి చెందిన పదేళ్ల అమ్మాయి ఎం.ఆర్.హన్సిని కాంస్యం సాధించింది. మినీ క్యాడెట్ బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో హన్సిని 12-10, 9-11, 5-11, 8-11తో లులియా పుగోవ్‌కినా (రష్యా) చేతిలో పరాజయం పాలైంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐటీటీఎఫ్ హంగేరి ఓపెన్ వరల్డ్ టూర్ టోర్నమెంట్‌లో రజతం
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు : సత్యన్ జ్ఞానశేఖరన్-ఆచంట శరత్ కమల్ (భారత్)
ఎక్కడ : బుడాపెస్ట్, హంగేరి

Published date : 24 Feb 2020 06:13PM