హజ్, జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపు
Sakshi Education
హజ్, జెరూసలేం యాత్రికులకు అందించే ఆర్థిక సాయాన్ని పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.
ఈ మేరకు నవంబర్ 19న ఉత్తర్వులు జారీ చేసింది. హజ్, జెరూసలేం యాత్రకు వెళ్లేవారిలో వార్షికాదాయం మూడు లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి ప్రస్తుతం అందిస్తున్న రూ. 40 వేల సహాయాన్ని రూ. 60 వేలకు, మూడు లక్షలకు పైగా వార్షికాదాయం ఉన్నవారికి ప్రస్తుతం ఇస్తున్న రూ. 20 వేలను రూ. 30 వేలకు ప్రభుత్వం పెంచింది. హజ్, జెరూసలేం యాత్రికుల కోసం 2019-20 బడ్జెట్‌లో వేర్వేరుగా చెరో రూ. 14.22 కోట్లు కేటాయించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హజ్, జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపు
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
క్విక్ రివ్యూ :
ఏమిటి : హజ్, జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపు
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Published date : 20 Nov 2019 04:33PM