Skip to main content

హెచ్-1బీపై నిషేధం ఎత్తివేయాలని అమెరికా కోర్టు తీర్పు

అమెరికాలో హెచ్-1బీ సహా ఇతర వీసాలన్నింటిపైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేయాలని అమెరికా కోర్టు తీర్పు చెప్పింది.
Current Affairs

ఈ విషయంలో అధ్యక్షుడు ట్రంప్ రాజ్యాంగబద్ధంగా తనకు సంక్రమించిన అధికారాలను మీరి ప్రవర్తించారని పేర్కొంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో 2020, జూన్‌లో హెచ్-1బీ, హెచ్-2బీ, ఎల్ వీసాలన్నింటిపైన ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ వివిధ ఐటీ కంపెనీలు, తయారీ సంస్థలు కోర్టుకెక్కాయి. ఈ పిటిషన్లను విచారించిన కాలిఫోర్నియా జిల్లా న్యాయమూర్తి జెఫ్రీ వైట్ నిషేధాన్ని ఎత్తివేయాలంటూ అక్టోబర్ 1న తీర్పు వెలువరించారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. దీంతో భారతీయ ఐటీ నిపుణులకు అత్యంత ప్రయోజనం చేకూరనుంది.

ట్రంప్‌కు కరోనా...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(74), ఆయన భార్య మెలానియా ట్రంప్‌నకు కరోనా సోకింది. ఈ విషయాన్ని అక్టోబర్ 2న ట్రంప్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Published date : 03 Oct 2020 05:56PM

Photo Stories