Skip to main content

హైదరాబాద్‌లో వెకా ప్లాంట్ ప్రారంభం

యూపీవీసీ ఉత్పత్తుల తయారీ సంస్థ ఎన్‌సీఎల్ వెకా హైదరాబాద్ శివారులో ప్లాంట్‌ను ప్రారంభించింది.
మెదక్ జిల్లా ముచ్చెర్లలో ఏర్పాటుచేసిన ఈ ప్లాంట్‌ను తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఫిబ్రవరి 13న ప్రారంభించారు. 16.8 ఎకరాల్లో రూ.50 కోట్ల పెట్టుబడులతో నెలకొల్పలిన ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 24 వేల టన్నుల ప్రొఫైల్స్ అని ఎన్‌సీఎల్ వెకా సీఈఓ అశ్విన్ దాట్ల తెలిపారు. ఈ ఉత్పత్తులను మన దేశంతో పాటూ మధ్య ప్రాచ్య, ఆఫ్రికా (ఎంఈఏ) మార్కెట్లలో సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ఎన్‌సీఎల్ వెకా కంపెనీ హైదరాబాద్‌కు చెందిన ఎన్‌సీఎల్ గ్రూప్, జర్మనీకి చెందిన వెకా జాయింట్ వెంచర్.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఎన్‌సీఎల్ వెకా ప్లాంట్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్
ఎక్కడ : ముచ్చెర్ల, మెదక్ జిల్లా, తెలంగాణ
Published date : 14 Feb 2019 05:38PM

Photo Stories