Skip to main content

హైదరాబాద్‌లో ఓలెక్ట్రా బస్ ప్లాంటు

హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ ఎలక్ట్రిక్ బస్‌ల తయారీ ప్లాంటును ఏర్పాటుచేయనున్నట్లు ఓలెక్ట్రాను ప్రమోట్ చేస్తున్న మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ గ్రూప్ డెరైక్టర్ కె.వి.ప్రదీప్ తెలిపారు.
బీవైడీ-ఓలెక్ట్రా తయారీ 40 ఎలక్ట్రిక్ బస్‌లను టీఎస్‌ఆర్‌టీసీ హైదరాబాద్‌లో మార్చి 5న ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ మేరకు వెల్లడించారు. కొత్త ఫ్యాక్టరీకి రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే ఓలెక్ట్రా సంస్థకు జడ్చర్ల వద్ద తయారీ కేంద్రం ఉంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ ఎలక్ట్రిక్ బస్‌ల తయారీ ప్లాంటు ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 5
ఎక్కడ : శంషాబాద్, హైదరాబాద్
Published date : 06 Mar 2019 05:42PM

Photo Stories