Skip to main content

హైదరాబాద్‌లో ఇండియన్ ఓషన్ సదస్సు

హైదరాబాద్‌లోని నొవాటెల్‌లో జూన్ 9 నుంచి 21 వరకు ఇండియన్ ఓషన్ ట్యూనా కమిషన్ 23వ సదస్సుని నిర్వహించనుంది.
జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీబీ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సదస్సులో ట్యూనా జాతి చేపల సంతతి పెంపొందించడం, వాటి సంరక్షణ, ట్యూన్ మాంసం ఉత్పత్తిని విస్తృతం చేయడం వంటి అంశాలపై చర్చించనున్నారు. 33 దేశాల ప్రతినిధులు పాల్గొనే సదస్సు తొలిసారిగా భారత్‌లో జరుగుతుందని మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ తెలిపారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఇండియన్ ఓషన్ ట్యూనా కమిషన్ 23వ సదస్సు
ఎప్పుడు : జూన్ 9 నుంచి 21 వరకు
ఎవరు : జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీబీ)
ఎక్కడ : హైదరాబాద్
Published date : 04 Jun 2019 05:44PM

Photo Stories