Skip to main content

హైదరాబాద్‌లో గోల్డ్‌మెడల్ ఎలక్ట్రికల్స్ ప్లాంటు

హైదరాబాద్‌లో పటాన్‌చెరు సమీపంలో ఎలక్ట్రికల్ గూడ్‌‌స తయారీ సంస్థ గోల్డ్‌మెడల్ ఎలక్ట్రికల్స్ ప్లాంటు ఏర్పాటుచేయనుంది.
ఈ ప్రతిపాదిత ప్లాంటుకు వచ్చే మూడేళ్లలో రూ.125 కోట్లు వెచ్చించనున్నట్లు గోల్డ్‌మెడల్ డెరైక్టర్ కిషన్ జైన్ ఆగస్టు 8న తెలిపారు. ఏటా 12 లక్షల ఫ్యాన్ల తయారీ సామర్థ్యంతో ఈ ప్లాంటుని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఎలక్ట్రికల్ గూడ్‌‌స పరిశ్రమలో గోల్డ్‌మెడల్‌కు 15-18 శాతం వాటా ఉందన్నారు. ఇప్పటికే గోల్డ్‌మెడల్ సంస్థకు విజయవాడ, ముంబై, రాజస్థాన్‌లో ఫ్యాక్టరీలు ఉన్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
గోల్డ్‌మెడల్ ఎలక్ట్రికల్స్ ప్లాంటు ఏర్పాటు
ఎప్పుడు : ఆగ స్టు 8
ఎవరు : గోల్డ్‌మెడల్ డెరైక్టర్ కిషన్ జైన్
ఎక్కడ : హైదరాబాద్
Published date : 09 Aug 2019 06:00PM

Photo Stories