హైదరాబాద్‌లో గ్లోబల్ హబ్ ఏర్పాటు చేసిన లండన్ సంస్థ?
Sakshi Education
వాహన రంగంలో లండన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫియట్ క్రైస్లర్ ఆటోమొబైల్స్ (ఎఫ్సీఏ) హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో గ్లోబల్ డిజిటల్ హబ్ ఏర్పాటు చేసింది.
ఐసీటీ ఇండియా పేరుతో ఏర్పాటైన ఈ సెంటర్ కోసం రూ.1,100 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు కంపెనీ తెలిపింది. ఉత్తర అమెరికా తర్వాత కంపెనీకి ఇదే అతిపెద్ద డిజిటల్ కేంద్రం. సంస్థ డిజిటల్ సామర్థ్యాలను పెంపొందించేందుకు సాంకేతిక వెన్నుదన్నుగా ఈ కేంద్రం పనిచేయనుంది.
ఇప్పటికే దేశంలో ఎఫ్‌సీఏకు పుణే, చెన్నైలో ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని రంజన్‌గావ్ వద్ద తయారీ ప్లాంటు ఉంది. ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే జీప్ కంపాస్ ఎస్‌యూవీని 13 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐసీటీ ఇండియా పేరుతో గ్లోబల్ డిజిటల్ హబ్ ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 16
ఎవరు : ఫయట్ క్రైస్లర్ ఆటోమొబైల్స్ (ఎఫ్‌సీఏ)
ఎక్కడ : గచ్చిబౌలి, హైదరాబాద్
ఎందుకు : డిజిటల్ సామర్థ్యాలను పెంపొందించేందుకు

Published date : 17 Dec 2020 07:08PM