Skip to main content

హామిల్టన్‌కు బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రి టైటిల్‌

2020 ఏడాది ఫార్ములావన్‌ (ఎఫ్‌1) సీజన్‌లోని నాలుగో రేసు బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రిలో బ్రిటన్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ విజేతగా నిలిచాడు.

ఇంగ్లండ్‌లోని సిల్వర్‌స్టోన్‌లో ఆగస్టు 2న జరిగిన ఈ రేసును  ‘పోల్‌ పొజిషన్‌’తో  ఈ మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ నిర్ణీత 52 ల్యాప్‌లను అందరికంటే వేగంగా, ముందుగా గంటా 28 నిమిషాల 01.283 సెకన్లలో ముగించాడు. ఈ రేసులో మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) రెండో స్థానంలో, చార్లెస్‌ లెక్‌లెర్క్‌ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. తాజా గెలుపుతో హామిల్టన్‌ రికార్డుస్థాయిలో ఏడోసారి (2008, 2014, 2015, 2016, 2017, 2019, 2020) బ్రిటిష్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అలాగే  సొంతగడ్డపై అత్యధిక ఎఫ్‌1 టైటిల్స్‌ గెలిచిన తొలి డ్రైవర్‌గా హామిల్టన్‌ రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా హామిల్టన్‌ కెరీర్‌లో ఇది 87వ ఎఫ్‌1 టైటిల్‌.

యూఎస్‌ ఓపెన్‌కు కిరియోస్‌ దూరం
ప్రతిష్టాత్మక టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ యూఎస్‌ ఓపెన్‌లో తాను బరిలోకి దిగడంలేదని  ఆస్ట్రేలియా వివాదాస్పద ఆటగాడు, ప్రపంచ 40వ ర్యాంకర్‌ నిక్‌ కిరియోస్‌ తెలిపాడు. కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి సంఘీభావంగానే తానీ నిర్ణయం తీసుకున్నాని పేర్కొన్నాడు. ఇటీవలే మహిళల ప్రపంచ నంబర్‌వన్‌ యాష్లేబార్టీ (ఆస్ట్రేలియా) కూడా కరోనా కారణంగా ఈ మెగా ఈవెంట్‌కు దూరంగా ఉంటున్నానని ప్రకటించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
  ఫార్ములావన్‌ (ఎఫ్‌1) సీజన్‌లోని నాలుగో రేసు బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రిలో విజేత
ఎప్పుడు :  ఆగస్టు 2
ఎవరు : బ్రిటన్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌
ఎక్కడ :సిల్వర్‌స్టోన్‌, ఇంగ్లండ్

Published date : 04 Aug 2020 05:25PM

Photo Stories