గ్రేటర్ నోయిడాలో కాప్14 సదస్సు
Sakshi Education
ఎడారీకరణను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఆధ్వర్యంలో కుదిరిన ఒప్పందం యునెటైడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిసెర్టిఫికేషన్ (యూఎన్‌సీసీడీ)పై ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో కాప్14 సదస్సు జరుగుతోంది.
సెప్టెంబర్ 2 నుంచి 13 వ తేదీ వరకు జరిగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్)14 సదస్సుకి 200 దేశాల నుంచి 70 మంది పర్యావరణ మంత్రులు, 8వేల మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. కాప్14కు భారత్ రెండేళ్లపాటు అధ్యక్షత వహించనుంది. ఈ కాప్14 సదస్సునుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 9న ప్రసంగించారు.
ప్రధాని ప్రసంగంలోని అంశాలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూఎన్‌సీసీడీ)పై కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్)14 సదస్సు
ఎప్పుడు : సెప్టెంబర్ 2-13
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్
ఎందుకు : ఎడారీకరణను ఎదుర్కోవడానికి
ప్రధాని ప్రసంగంలోని అంశాలు
- ప్రపంచదేశాలన్నీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (ఎస్‌యూపీ)కి ఇక గుడ్ బై చెప్పే సమయం వచ్చేసింది.
- పర్యావరణంలో వస్తున్న మార్పులు ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
- 2015-17 మధ్య కాలంలో భారత్‌లో పచ్చదనం, అటవీ విస్తీర్ణం 8 లక్షల హెక్టార్లకు పెరిగింది.
- 2030 నాటికి 2.1 కోట్ల హెక్టార్ల నుంచి 2.6 కోట్ల హెక్టార్ల భూముల్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
- భూముల్ని పునరుద్ధరించడానికి భారత్ రిమోట్ సెన్సింగ్, స్పేస్ టెక్నాలజీని వినియోగిస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూఎన్‌సీసీడీ)పై కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్)14 సదస్సు
ఎప్పుడు : సెప్టెంబర్ 2-13
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్
ఎందుకు : ఎడారీకరణను ఎదుర్కోవడానికి
Published date : 10 Sep 2019 08:18PM