గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్రంతో భాగస్వామ్యం చేసుకున్న సంస్థ?
Sakshi Education
కామన్ సర్వీసెస్ సెంటర్(సీఎస్‌సీ) అకాడమీ ద్వారా గ్రామీణ యువతకు సాంకేతిక విద్యా, నైపుణ్య శిక్షణ అందించేందుకు... కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఐబీఎం మధ్య భాగస్వామ్యం కుదిరింది.
దీంతో గ్రామీణ యువత, ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ టెక్నాలజీ వంటి ప్రత్యేకమైన కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఐబీఎం సహకరిస్తుంది. ఈ కార్యక్రమంలో ఐబీఎంతో పాటు సీఎస్‌ఆర్ బాక్స్, యువ జాగృతి సంస్థాన్‌లు భాగస్వామ్యమయ్యాయి.
గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ సర్వీసెస్ అందించే లక్ష్యంతో కేంద్ర ఐటీ విభాగం రూపొందించిన కామన్ సర్వీసెస్ సెంటర్స్ (సీఎస్‌సీ)లో భాగమే సీఎస్‌సీ అకాడమీ.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యం
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఐబీఎం
ఎందుకు : కామన్ సర్వీసెస్ సెంటర్(సీఎస్‌సీ) అకాడమీ ద్వారా గ్రామీణ యువతకు సాంకేతిక విద్యా, నైపుణ్య శిక్షణ అందించేందుకు..

Published date : 27 Nov 2020 06:07PM