గోవింద్‌పూర్‌లో హట్సన్ ఐస్‌క్రీమ్ ప్లాంట్
Sakshi Education
చెన్నైకి చెందిన పాలు, పాల ఉత్పత్తుల కంపెనీ హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్... తెలంగాణలో అతిపెద్ద ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది.
రూ.207 కోట్ల పెట్టుబడులతో సంగారెడ్డి జిల్లాలోని గోవింద్‌పూర్‌లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఫిబ్రవరి 12న కంపెనీ తెలిపింది. 2020, ఏడాది అక్టోబర్ నాటికి ప్లాంట్ కార్యకలాపాలు ఆరంభమవుతాయని పేర్కొంది. ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా 250 మందికి ఉద్యోగాలతో పాటు, పరోక్షంగా మరో 250 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, స్థానికంగా ఉన్న సుమారు 4 వేల మంది పాడి రైతులు ప్రయోజనం పొందుతారని వివరించింది.
హట్సన్ సంస్థ అరుణ్ ఐస్ క్రీమ్, హట్సన్, ఆరోక్య మిల్క్, ఐబాకో ఐస్‌క్రీమ్స్, ఓయాలో, అనీవా, సంటోసా బ్రాండ్లతో పాలు, పెరుగు, ఐస్‌క్రీమ్స్, నెయి్య, పన్నీర్ వంటి అన్ని రకాల పాల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ కార్యకలాపాల్లో ఉంది. మన దేశంలో విక్రయించడంతో పాటు అమెరికా, మధ్యప్రాచ్యం వంటి 38 దేశాలకు ఎగుమతులూ చేస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రం ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్
ఎక్కడ : గోవింద్‌పూర్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ

Published date : 13 Feb 2020 05:45PM