గోవా సీఎంగా ప్రమోద్ ప్రమాణ స్వీకారం
Sakshi Education
గోవా 13వ ముఖ్యమంత్రిగా అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు. గోవా రాజధాని పణజీలో మార్చి 19న ప్రమోద్ చేత గవర్నర్ మృదులా సిన్హా కొత్త ప్రమాణం చేయించారు.
అనంతరం 11 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. కొత్త ప్రభుత్వం మార్చి 20న అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న గోవాలో మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ), గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ), ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతుండటం తెలిసిందే. ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పరీకర్ మార్చి 17న కన్నుమూశారు.
1973, ఏప్రిల్ 24న గోవాలో జన్మించిన ప్రమోద్ సావంత్ మహారాష్ట్రలోని కోల్హాపూర్ ఆయుర్వేద వైద్య విద్యనభ్యసించి కొంతకాలం వైద్యుడిగా పనిచేశారు. ఆరెస్సెస్‌లో పనిచేసిన ఆయన బీజేపీలో యువజన నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఉత్తర గోవాలోని సంఖాలిమ్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పరీకర్‌కు విశ్వాసపాత్రుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
గోవా అసెంబ్లీలో పార్టీల బలాబలాలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : గోవా 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : ప్రమోద్ సావంత్
ఎక్కడ : పణజీ, గోవా

ప్రస్తుత సభ్యులు | 36 (మొత్తం 40) |
బీజేపీ | 12 |
గోవా ఫార్వర్డ్ పార్టీ | 3 |
మహారాష్ట్ర గోమంతక్ పార్టీ | 3 |
కాంగ్రెస్ | 14 |
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | 1 |
స్వతంత్రులు | 3 |
ఏమిటి : గోవా 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : ప్రమోద్ సావంత్
ఎక్కడ : పణజీ, గోవా
Published date : 20 Mar 2019 05:03PM