Skip to main content

గణతంత్ర వేడుకలకు బ్రిటన్ ప్రధాని

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని అంగీకరిస్తే, 1993 తరువాత బ్రిటన్ ప్రధాని తొలిసారి భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
Current Affairsప్రధాని నరేంద్రమోదీ నవంబర్ 27న బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌తో ఫోన్‌లో ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తూ... 2021, జనవరి 26న భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలంటూ ఆహ్వానించారు. అలాగే 2021 ఏడాది బ్రిటన్‌లో జరిగే జీ-7 సమ్మిట్‌కి ప్రధాని మోదీని.. బోరిస్ ఆహ్వనించారు. చివరిసారి 1993లో బ్రిటన్ ప్రధాని జాన్ మేజర్ భారత గణతంత్ర వేడుకలకు హాజరయ్యారు.

చదవండి: 2020 ఏడాది భారత గణంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు?
Published date : 04 Dec 2020 06:04PM

Photo Stories