Skip to main content

గ్లోబల్ ఆర్ అండ్ డీ సమ్మిట్- 2019 ప్రారంభం

సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన, అభివృద్ధిలో పరస్పర సహకారం అందించుకునేందుకు హైదరాబాద్ వేదికగా గ్లోబల్ ఆర్ అండ్ డీ సమ్మిట్-2019ను నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.


ఫిబ్రవరి 20న ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ, ఫిక్కీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో ఈ సదస్సును నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 21న ఉదయం 10:30 గంటలకు సదస్సు ప్రారంభం అవుతుందని, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ కీలక ప్రసంగం చేస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతోపాటు ఆఫ్రికాలోని జాంబియా, ఉగాండా, ఇథియోపియా తదితర దేశాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొంటారని ఆయన వెల్లడించారు. ఇందులో భారత్, ఆఫ్రికా దేశాల మధ్య శాస్త్రసాంకేతిక రంగాల్లో పరిశోధన, ఇరు దేశాల అభివృద్ధి సహకారంపై చర్చించనున్నట్లు వివరిం చారు. సదస్సు మొదటి రోజు ప్రారంభ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యదర్శి అశుతోష్ శర్మ, ఫిక్కీ వైస్ ప్రెసిడెంట్ సంగీతారెడ్డి, ఇథియోఫియా సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఇంజనీర్ గెటహన్ మెకురియా తదితరులు పాల్గొంటారని వివరించారు. అనంతరం టెక్నికల్ సెషన్‌లో ఇన్నోవేషన్, టెక్నాలజీ ట్రాన్స్ ఫర్, కమర్షియలైజేషన్ ప్రోగ్రాం వంటి అంశాలపై చర్చిస్తారన్నారు. రెండో రోజు కూడా శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారంపై చర్చిస్తారని వివరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
గ్లోబల్ ఆర్ అండ్ డీ సమ్మిట్-2019
ఎప్పుడు : ఫిబ్రవరి 21, 22 తేదీల్లో
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన, అభివృద్ధిలో పరస్పర సహకారం అందించుకునేందుకు..
Published date : 21 Feb 2019 06:00PM

Photo Stories